Reels: రీల్స్ కోసం ఉరేసుకున్న కుర్రాడు ...నిజంగానే బిగుసుకున్న ఉరి 2024-06-20 21:28:39

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏం రోజులు రా నాయనా...పులి మేక కథ లా తయారయ్యారు ఏది నిజమో..ఏది సరదానో ...ఏది ప్రాంక్ ..ఏది నిజం తెలీడం లేదు. రీల్స్( reels) పిచ్చికి మరో యువకుడు బలయ్యాడు. మెడకు ఉరి బిగించుకుని రీల్స్ చేసే క్రమంలో అది మెడకు బిగుసుకుపోవడంతో మరణించాడు. 


వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిందీ విషాదం. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కందకట్ల( kanda katla)  అజయ్ (23) హోటల్‌లో పనిచేస్తుంటాడు. సో షల్ మీడియా లో పోస్ట్ చేసి డబ్బులు సంపాదించాలి. రీల్స్ చేసి వాటిని తన ఖాతాలో షేర్ చేసే అలవాటున్న అజయ్ ( ajay) రెండ్రోజుల క్రితం మల్లంపల్లి రోడ్డులోని తన చిన్నక్క ఇంటికి వచ్చాడు.అక్కడ ఉరివేసుకుంటున్నట్టుగా వీడియో చిత్రీకరించాలని అనుకున్నాడు. దూలానికి ఉరి ఏర్పాటు చేసి ఫోన్‌ను ఫ్రిడ్జ్‌పై పెట్టాడు. 


వీడియో రికార్డింగ్ టైంలో ఉరి నిజంగానే మెడకు ( neck) బిగుసుకుపోయింది. నిన్న ఉదయం ఉరికి వేలాడుతున్న అజయ్( ajay)  మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు సెల్‌ఫోన్‌ను ( ceస్వాధీనం చేసుకున్నారు. కాగా, అజయ్ మృతిపై తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.