Rains: రాష్టంలో మరో మూడు రోజులు వర్షాలు  2024-06-21 16:30:49

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో రానున్న మూడు రోజు ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ప్ర‌భావంతో పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కి. మీ. మధ్య ఏర్పడింది. ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుండి వీచుచున్నాయిని దీంతో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. రేపు రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల‌, నిర్మ‌ల్, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మొస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు పలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. వ‌ర్షాలు కురిసే స‌మ‌యంలో గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ప్రజలు రాగల మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.