Cabinet: క్యాబినెట్ నిర్ణయాలపై ఉత్కంఠ 2024-06-21 08:15:05

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరిపాలన, ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసాకి నిధుల సమీకరణ, విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం అనేక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్ 9కి ముందు రూ.2 లక్షలలోపు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఏక కాలంలో రుణమాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాగా పంట రుణాల మాఫీకి రూ.40 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.