Micro Artist: రావి ఆకు మీద యోగాసనాలు  2024-06-21 15:45:58

న్యూస్ లైన్ డెస్క్: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్, మైక్రో ఆర్టిస్ట్, కవి, రచయిత ఆచార్య. గాలిపెల్లి చోళేశ్వర్ చారి యోగా దినోత్సవ సందర్భంగా రావి ఆకు మీద పది యోగాసనాలను ఎంతో ఆకర్షణీయంగా చిత్రీకరించారు. యోగ అనేది మానవుని యొక్క జీవనశైలిలో ఎంతో ముఖ్యమైనదని మానవుల ఆరోగ్యం పెంపొందించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని మార్చి పతాంజలి మనకు అందించారు. యోగా ద్వారా శరీరం ఎంత ఉత్తేజంగా ఉంటూ రోగాలను తగ్గిస్తుంది. కనుక అందరూ పాటించాలని మానవాళికి యోగాన్ని పరిచయం చేసింది. భారతీయ సంస్కృతి ఈ రోజున పురస్కరించుకొని అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవం జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించిన అత్యున్నతమైనటువంటి ఆరోగ్య సూత్రం యోగ నే. దేశ విదేశాల్లో ఉన్న అందరికీ చారి ఈ చిత్రం ద్వారా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చారి వేములవాడలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆర్టి టీచర్గా పని చేస్తున్నారు. 2024 గాను ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్నారు. ఎన్నో వరల్డ్ రికార్డ్స్ ని సొంతం చేసుకున్నారు. విశ్వకర్మ లెజెండరీ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. ఈ ఆర్ట్ ను చూసినటువంటి ఉపాధ్యాయులు, యోగా ప్రేమికులు చారిని అభినందించారు.