KTR: బొగ్గు గనుల వేలం కేటీఆర్ కామెంట్స్ 2024-06-20 17:06:29

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ(Telangana)లోని బొగ్గు గనులను వేలం వేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం(central government) లేఖ రాసింది. గత పదేళ్లుగా మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్(KTR) గనులను వేలం వేయనివ్వలేదని.. ఈసారి ఖచ్చితంగా వేలం వేసి తీరాలని లేఖలో పేర్కొంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకుంటే తామే వేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా, ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ(BJP), కాంగ్రెస్‌(congress)కు చెరో 8 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి బొగ్గును వేలం వేసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 
సింగరేణి(singareni)ని ప్రయివేటీకరించడానికే వేలం వేయాలని చెబుతున్నారని అన్నారు. బొగ్గును వేలం వేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశాని గుర్తుచేశారు. అదానికి బైలదిల్లా గని కేటాయించడం వల్ల విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్లిందని తెలిపారు. నష్టాల్లోకి వెళ్లడం వల్లనే విశాఖ ఉక్కు అమ్ముతున్నట్లు కేంద్రం తెలిపిందని అన్నారు. 
ఒడిశాలో రెండు గనులను వేలం లేకుండా నైవేలీ లిగ్నైట్‌కు అప్పగించారని కేటీఆర్ తెలిపారు. గుజరాత్‌లోనూ గనులను వేలం వేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించారని తెలిపారు. తమిళనాడులో కూడా ప్రభుత్వరంగ సంస్థకు బొగ్గు గనులు వేలం లేకుండా ఇచ్చారని వెల్లడించారు. 16 ఎంపీ సీట్లను ఇవ్వండి కేంద్రంలో మనం నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని కేసీఆర్ అన్నప్పుడు.. 16 మంది ఎంపీలతో  ఎం చేస్తారని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ పార్టీకి 16 ఎంపీ సీట్లు ఇస్తే వాళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో  కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 ఇస్తే వీళ్లు మన బొగ్గు గనులను వేలం వేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.