USFI: ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి 2024-06-21 15:11:23

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడిపై ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్(USFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్కూల్ బోర్డ్ అదనపు డైరెక్టర్ కె లింగయ్యకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ గత ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల విద్యాసంస్థలలో ఫీజుల దోపిడిపై స్పందించకుండా నిర్లక్ష్యం వహించారనిదాని ఫలితంగా యజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం 20 నుంచి 30% ఫీజులు పెంచుకుంటూ విద్యార్థులను తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజులను అరికట్టడం పై ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో పి రెగ్యులారిటీ కమిటీలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ డీఈవోలు యజమాన్యాలు కుమ్మక్కై యజమాన్యాలకు మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. 

డీఈవోల అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వము ఎంక్వయిరీ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే అధికారుల పని విధానం పై కూడా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ స్కూల్లో బుక్స్ చెప్పినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా యజమానియాలు సొంత ప్రెంట్ చేసుకొని వేలాది రూపాయలకు బుక్స్ అమ్ముతున్నారని దీనిపై ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేయడమన్నారు. అనేకమంది తల్లిదండ్రులు ఇబ్బందులు గురవుతున్నారని స్థానిక అధికారులు ప్రజా ప్రజలు పట్టినట్టు వివరించడం ఏమిటని అన్నారు. తక్షణమే విద్యా వ్యాపారంపై రాష్ట్రవ్యాప్తంగా స్పందన రావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బోడి ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చెదలాపురం మధు, రాష్ట్ర నాయకులు బి వెంకట్, వికాస్, జయకృష్ణా తదితరులు పాల్గొన్నారు.