Reema Sen: ఫేస్ చూడకుండా ప్రేమలో పడ్డ ఉదయ్ కిరణ్ హీరోయిన్..!

Published 2024-06-20 10:45:36

postImages/2024-06-20/1718860536_remma.jpg

సినీ ఇండస్ట్రీ లో ఒకప్పుడు తెలుగు,తమిళ, హిందీ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రీమాసేన్ అంటే అందరికీ సుపరిచితమే. అయితే ఈ హీరోయిన్ పేరు చెప్పే కంటే చిత్రం మూవీ హీరోయిన్, మనసంతా నువ్వే మూవీ హీరోయిన్ అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది.ఇక ఈ రెండు సినిమాల ద్వారా టాలీవుడ్ లో మంచి ఇమేజ్ సంపాదించింది రీమాసేన్.అయితే గతంలో ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రీమాసేన్ మాట్లాడుతూ.. నేను స్కూల్ టైం లో ఓ వ్యక్తి ఫేస్ గుర్తులేకుండానే ప్రేమలో పడిపోయాను. అయితే నాకు ఫెయిర్ గా ఉండేవాళ్ళు అస్సలు నచ్చరు. కానీ ఆయన ఫేయిర్ గా ఉన్నా సరే నాకెందుకో నచ్చేసాడు.ఇక ఓ రోజు పార్టీలో బ్లాక్ జాకెట్, రెడ్ షర్ట్ ధరించి కనిపించాడు. అయితే ఇప్పటికీ ఆయన వేసుకున్న డ్రెస్ గుర్తుంది కానీ ఆయన ఫేస్ మాత్రం గుర్తులేదు.ఆ అబ్బాయే నా ఫస్ట్ క్రష్ అంటూ రీమాసేన్ చెప్పింది. అయితే అప్పటి వీడియో మళ్లీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది


Tags : newslinetelugu uday-kiran reema-sen chitram-movie manasantha-nuvve

Related Articles