Kajal: తెలుగు వాళ్ళ కోసం పెళ్లిలో ఆ పని చేసిన కాజల్ అగర్వాల్..!

Published 2024-06-20 08:52:56

postImages/2024-06-20/1718853776_kajal.jpg

టాలీవుడ్ చందమామగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మదుల్లో గుడి కట్టుకున్న హీరోయిన్ ఎవరూ అంటే అందరికీ కాజల్ అగర్వాల్ మాత్రమే గుర్తుకొస్తుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తన పెళ్లిలో తెలుగు వాళ్ళ కోసం ఒక పని చేసిందట.అదేంటంటే కాజల్ అగర్వాల్ పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇక ఈమె లాక్ డౌన్ సమయంలో అంటే 2020లో తన చిన్ననాటి స్నేహితుడు అలాగే వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ కిచ్లూ ని పెళ్లాడింది. అయితే వీరి పెళ్లి పంజాబీ సాప్రదాయంలో జరిగినప్పటికీ తెలుగు సాంప్రదాయంలో ఉన్న ఒక పని చేసిందట. అదేంటంటే జీలకర్ర బెల్లం పెట్టుకోవడం. ఇక ఈ జీలకర్ర బెల్లం పెట్టుకోవడానికి ప్రధాన కారణం నన్ను తెలుగువాళ్లే ఇండస్ట్రీలో పేరు వచ్చేలా చేశారు.నా సినిమాలు తెలుగులోనే స్టార్ట్ అయ్యాయి.నన్ను ఆదరించిన వాళ్ళు తెలుగు వాళ్లే..అందుకని వారికి ట్రిబ్యూట్ గా నేను నా పెళ్లిలో తెలుగు సాంప్రదాయం ప్రకారం జీలకర్ర బెల్లం పెట్టుకున్నాను అంటూ ఒక సీక్రెట్ విషయాన్ని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.


Tags : kajal-aggarwal gautham-kichlu marraige, chandamama newslinetelugu

Related Articles