Pawan Kalyan: రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కు వడ్డీకి డబ్బులిచ్చాడా.?

Published 2024-06-20 11:31:26

postImages/2024-06-20/1718863286_PAWAN.jpg

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే  మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంటే  మంచి ఆదరాభిమానాలు ఉన్న కుటుంబం.. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు స్టార్డం పొందారు.అలాంటి మెగా ఫ్యామిలీ లోని హీరో రామ్ చరణ్ దగ్గర పవన్ కళ్యాణ్ వడ్డీకి అప్పు తీసుకునేవారట. మరి ఎప్పుడు తీసుకున్నారు ఆ వివరాలు ఏంటో చూద్దామా. రామ్ చరణ్ వద్ద పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుంది ఇప్పుడు కాదు. తాను ఇండస్ట్రీలోకి రాకముందు. అయితే చిరంజీవి అప్పుడు తన కొడుకు రామ్ చరణ్ కు మరియు తమ్ముడు పవన్ కళ్యాణ్ కు పాకెట్ మనీ గా డబ్బులు ఇచ్చేవారట. ఆ టైంలో రామ్ చరణ్ చాలా చిన్నవాడు. తనకిచ్చిన డబ్బులను సేవ్ చేసుకునేవాడట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ డబ్బులు అన్ని  ఖర్చు చేసేసి మళ్లీ రామ్ చరణ్ దగ్గరికి వచ్చి ఏదో ఒక మాట చెప్పి డబ్బులు తీసుకునే వాడట. నీకు వడ్డీతో సహా ఇస్తానని నమ్మించే వాడట. అయితే ఈ విషయాన్ని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకొని ఆనాటి స్వీట్ మెమోరీ అంటూ  సంబరపడిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Tags : chiranjeevi newslinetelugu ram-charan pawan-kalyan mega-family

Related Articles