Amithab: ఆ నిర్మాత కాళ్లు మొక్కిన అమితాబ్.. ఎందుకంటే.?

Published 2024-06-20 07:47:21

postImages/2024-06-20/1718849841_kalki.jpg

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 ఏడి సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా జూన్ 27న విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ బిజీబిజీగా గడుపుతుంది చిత్ర యూనిట్. అయితే తాజాగా ముంబైలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరిపింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత అశ్వినీ దత్ స్టేజి మీదకి వచ్చిన సమయంలో అమితాబ్ బచ్చన్ ఆయన కాళ్లు మొక్క బోయారు. అయితే అంత పెద్ద స్టార్ హీరో నిర్మాత అశ్వినీ దత్ కాళ్లు మొక్కడం అంటే  ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.ఇక అశ్వినీ దత్ కాళ్లు మొక్కే సమయంలో ఆయన కూడా అమితాబ్ బచ్చన్ కాళ్ళు మొక్కడానికి వెళ్లారు. అలా పరస్పరం ఒకరి కాళ్లు ఒకరు మొక్కాలని చూశారు. అయితే ఈ ఈవెంట్లో నిర్మాత అశ్వినీ దత్ గొప్పతనం గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. అశ్వినీ దత్ వంటి నిర్మాతను నేను ఎక్కడా చూడలేదు.ఆయన చాలా పాజిటివ్ గా ఉంటారు.అలాగే షూటింగ్ సెట్లో ఆయన ముందుండి హీరోకి ఎలాంటి రిస్క్ లేకుండా చేస్తారు


Tags : prabhas ashwini-datt amithab-bachchan kalki-2898-ad deepika-padukone

Related Articles