YCP: ఈవీఎంల వెరిఫికేషన్ కోసం ఈసీకి వైసీపీ నేతల దరఖాస్తు 2024-06-20 19:48:11

న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈవీఎంల భద్రతపై చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంల అంశంపై దేశ వ్యాప్తంగా మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గురువారం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఈవీఎంల తనిఖీ, వెరిఫికేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘంకు పలు పార్టీలు దరఖాస్తు చేసుకున్నారు. లోక్‌సభ ఈవీఎంల కోసం 9, అసెంబ్లీ ఈవీఎంల కోసం 12 దరఖాస్తులు వచ్చాయిని ఈసీ తెలిపింది. ఇందులో వైసీపీ ఒక లోక్‌సభ, 12 అంసెబ్లీ ఈవీఎంలకు దరఖాస్తులు చేసుకుందని పేర్కొంది. వైఎస్సార్‌సీపీ నుంచి విజయనగరంలోని బొబ్బిలి, నెల్లిమర్లలోని ఒక పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేశారు. అలాగే గజపతినగరం అసెంబ్లీలోని ఒక పోలింగ్ కేంద్రం, ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాలలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు చేశారు. వెంటనే ఈవీఎంలను పరిశీలించి. తమకు న్యాయం జరిగేలా చూడాలని వైసీపీ నేతలు ఈసీని కోరారు.