IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

Published 2024-06-19 09:50:36

postImages/2024-06-19/1718807854_iastransfers.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా 19 మంది ఐఏఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవలను జీఏడికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇక జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్గా జి సాయిప్రసాద్, పంచాయితీ రాజ్ ముఖ్యకార్యదర్శిగా శశి భూషణ్, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా రాజశేఖర్, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణా ద్వివేది, పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనిల్కుమార్ సింఘాల్, పౌరసరఫరాలశాఖ కమిషనర్గా సిద్ధార్థ్ జైన్, పాఠశాల కార్యదర్శిగా కోన శశిధర్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్, సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్న రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.


Tags : ap-news chandrababu

Related Articles