fire accident: అగ్నిప్రమాదంలో దివ్యంగ బాలిక సజీవ దహనం 2024-06-20 18:12:42

న్యూస్ లైన్ డెస్క్: అగ్నిప్రమాదం(fire accident)లో దివ్యంగ బాలిక సజీవ దహనమైంది. నెల్లూరు(nellore) జిల్లాలోని బర్మా షెల్ గుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకేసారి 6 గ్యాస్ సిలిండర్లు(gas cylinders) పేలిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని దివ్యాంగురాలైన నాగలక్ష్మి(12) మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. భారీగా మంటలు చెలరేగడంతో 4 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామస్థులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల(fire engines) సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్యాస్ సిలిండర్లు పేలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.