health: ఈ గోరుచిక్కుడు తింటే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా ? 2024-06-20 21:54:46

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  గోరుచిక్కుడు కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా దీన్ని చపాతీలోనే ఎక్కువగా తింటుంటారు. గ్రీన్ బీన్స్ వంటి ఈ కూరగాయ( vegtables)  మన ఆరోగ్యానికి చాలా మంచిది. రిచ్ ఫైబర్. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఫైబర్ తినాల్సి ఉంటుంది. వీటిలో ప్రోటీన్, ఫైబర్( fier) , కార్బోహైడ్రేట్( carbo hydrates) , కాల్షియం, విటమిన్ సి వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి, శరీరంలో ఇనుము( iron  లోపాన్ని పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది. 
గోరుచిక్కుడులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫాస్ట్ గా తగ్గుతారు. అంతేకాదు గోరుచిక్కుడు కాయల్లో  ఎక్కువ మొత్తంలో ఇనుము ఉంటుంది. ఇది మీ శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. 


ఈ కూరగాయలో ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులో పిండాన్ని ఎన్నో సమస్యల నుంచి కాపాడుతుంది. గోరుచిక్కుడులో ఉండే విటమిన్ కె మన ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇది పిల్లలు బాగా ఎదగడానికి సహాయపడుతుంది.


గోరుచిక్కుడులో హైపోగ్లైసీమిక్,  హైపోలిపిడెమిక్ లక్షణాలు ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇవి మంచి ప్రయోజనకరంగా ఉంటాయి.  డయాబెటిస్, గుండె జబ్బులు , హైబీపీ నుంచి కూడా కాపాడుతుంది. ఆడవాళ్లలోనే ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో తరచుగా నీరసంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు గోరుచిక్కుడు తింటే బలహీనత తొలగిపోతుంది. ఎనీమియా సమస్యను కూడా దాటేయొచ్చు .