GLYCOLIC ACID: గ్లైకాలిక్ యాసిడ్ వాడుతున్నారా.. 2024-06-19 20:35:34

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: స్కిన్ కేర్ ( SKIN CARE) లో యాసిడ్స్ వాడకం చాలా ఎక్కువవుతుంది. సోషల్ మీడియా ( SOCIAL MEDIA) పుణ్యమా అని యాసిడ్ క్రీమ్స్ , లోషన్స్ , హెయిర్ మాస్క్ లు..విచ్చలవిడిగా వాడేస్తున్నారు. డాక్టర్ల సలహా లేకుండానే స్కిన్ మీద యాసిడ్ వాడడం ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో అస్సలు అర్ధం కావడం లేదు. 


గ్లై కాలిక్ యాసిడ్ ( GLYCOLIC ACID) బాగా హైడ్రేట్ చేస్తుంది, కానీ సరిగ్గా వాడకపోతే మాత్రం చర్మాన్ని పొడిబారిపోయటట్లు చేస్తుంది. అందుకే, మీ స్కిన్‌కేర్ రొటీన్‌లో గ్లైకాలిక్ యాసిడ్‌ని యాడ్ చేసుకోదల్చుకుంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.


సాధారణంగా మానవ శరీరం సహజంగానే స్కిన్ తేమగా, మెరుస్తూ ఉంటుంది. అయితే, వయసు పెరిగే కొద్దీ ఈ కొలాజిన్ లెవల్స్ తగ్గుతూ వస్తాయి. అందుకే, షీట్ మాస్క్స్( SHEET MASK) , సీరమ్స్( SERUM) , మాయిశ్చరైజర్స్‌ వాడుతుంటారు .ఈ గ్లైకాలిక్  యాసిడ్‌ని ముడతలు పోగొట్టే, స్కిన్‌ని హైటేట్‌గా ఉంచే ఒక వండర్ మాలిక్యూల్‌గా చూడడం మాత్రం కొద్దిగా ఎక్కువే అంటారు వీరు. ఎందుకంటే, సరిగ్గా యూజ్ చేయకపోతే దీని వల్ల చెడు జరిగే అవకాశం కూడా ఉంది.


  ఈ మధ్య కాలంలో అండర్ ఆర్మ్ , స్కిన్ .హెయిర్ కి కూడా..ఈ యాసిడ్ వాడుతున్నారు. దీని వల్ల స్కిన్ క్యాన్సర్లు, స్కిన్ టిష్యూ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న వయసులోనే పెద్ద వయసు వారిలో కనిపిస్తారు. యాసిడ్ కారణంగా స్కిన్ లో కొలాజిన్ లెవల్స్ తగ్గిపోతాయి. యూట్యూబ్ లో అందరు చెప్తున్నారని గ్లైకాలిక్ యాసిడ్ క్రీమ్స్ , హెయిర్ మాస్క్ లు వాడకూడదంటున్నారు డాక్టర్లు. కేర్ ఫుల్ ఫ్రెండ్స్.