Job Applicant: జాబ్ రాకపోతే ...గర్ల్ ఫ్రెండ్ వెళ్లిపోతుంది సార్...ఓ వ్యక్తి వింత అభ్యర్ధన 2024-06-19 20:54:06

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పాపం..అభ్యర్దన వింతగా ఉన్నా...ఆ వ్యక్తి పడే బాధే ఎక్కువ కనిపిస్తుంది. పాపం ఏ ఉద్యోగానికి వెళ్లినా లేదంటున్నారో ఏమో...పాపం ఏం చెయ్యలేక ఇక చేసేది లేక హెచ్ ఆర్ కే  ఓ వింత విన్నపం చేసుకున్నాడు..అయ్యా..అమ్మా మీరు కనుక ఉద్యోగం ఇవ్వకపోతే నేను కోరుకున్నపిల్లని పెళ్లి చేసుకోవడం కుదరదు అంటు ఓ లెటర్ రాసి ఇచ్చాడు.


ఆర్వా హెల్త్ గ్రూప్ కంపెనీ ( arwa health group company) ఇటీవల ఓ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. తమ కంపెనీలో ఖాళీల భర్తీకి తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సదరు పోస్టుకు మీరు ఎలా సూట్ అవుతారనేది క్లుప్తంగా రాసిపంపించాలని చెప్పింది. ఆ స్టోరీలో మనోడు తన పర్సనల్ స్టోరీ కూడా రాసి పంపాడు. ఇంతకీ వివరంగా ఏం రాశాడంటే ‘సార్ ఈ ఉద్యోగం కనుక రాలేదంటే నా చిన్ననాటి ప్రియురాలు నాకు దూరమవుతుంది. ఆమెను పెళ్లిచేసుకోలేను’ అంటూ వేడుకున్నాడు.


కాబోయే అల్లుడికి మంచి ఉద్యోగం ఉండాలన్న తన ప్రియురాలి తండ్రి కండీషన్ తన ప్రేమకు పెద్ద అడ్డంకిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిని స్క్రీన్ షాట్ తీసి హెచ్ ఆర్ ఉద్యోగి ఒకరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఒక్కోసారి హెచ్ ఆర్ పోస్ట్ కూడా ఫన్నీగా ఉంటుందంటు ..ఆ మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక మామూలు వైరల్ కాదు..ఒక్కరోజులో 2.2 లక్షల మందికి పైగా ఈ పోస్టు చూశారు. అసలు ఈ పోస్ట్ కు కామెంట్స్ స్పెషల్ అట్రాక్షన్. అతని నిజాయితీకైనా ఉద్యోగం ఇవ్వడంటు కొన్ని వందల కామెంట్లు వస్తాయి.