RSP: నిరుద్యోగ వ్యతిరేక కాంగ్రెస్ మెడలు వంచాలి 2024-06-19 19:28:58

న్యూస్ లైన్ డెస్క్: నమ్మక ద్రోహ-నిరుద్యోగ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలని బీఆర్‌స్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. రేపు నిరుద్యోగ సంఘాల జేఏసి& అశోక్ సర్, చేయబోతున్న మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణలో గ్రూప్-2 & 3 పోస్టులను పెంచాలని, జివో 46 బాధిత అభ్యర్థులకు సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు ప్రిపేర్ కావడం కోసం మరి కొంత సమయం ఇవ్లాలని, టెట్ స్కోర్లను నార్మలైజ్ చేసినంకనే డీఎస్సీ నిర్వహించాలన్నారు. అలాగే ఏఈఈల నియామకం వెంటనే జరిపి, ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలండర్, నిరుద్యోగ భృతి, గురుకుల బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎంపికైన 140 మంది పోలీసు అభ్యర్థులను వెంటనే శిక్షణకు పంపాలని, అందుకు కావలసిన బడ్జెట్ ను వెంటనే పోలీసు శాఖకు విడుదల చేయాలన్నారు. ఇలా మరెన్నో నిరుద్యోగ సమస్యల పరిష్కారించాలని ప్రవీణ్ కుమార్ సోషల్ మీడిమా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.