Water Fall: జలకళ సంతరించుకున్న బొగత జలపాతం 2024-06-19 18:41:44

 

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుంది. రాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లాలోని బొగత జలపాతానికి భారీగా వరద నీరు పారుతున్న‌ది. దీంతో ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న‌ నీటితో జ‌ల‌పాతం కనువిందు చేస్తున్న‌ది. వర్షాకాలం వచ్చిందంటే ఈ జలపాతం ఎంతో అందంగా జాలువారుతుంది. ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.