Telangana: కాంగ్రెస్‌పై రాకేష్ రెడ్డి ఫైర్ 2024-06-20 15:35:31

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్(congress) ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి(Rakesh reddy) తీర్వ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్(telangana bhavan)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నం పెట్టే వాడికి సున్నం పెట్టడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నిరుద్యోగ యువత(unemployed youth) అరిగోస పుచ్చుకుంటున్నదని మండిపడ్డారు. మార్పు కోసం కాంగ్రెస్‌కు నిరుద్యోగ యువత అవకాశం ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిరుద్యోగ యువతనే కాంగ్రెస్ వేధిస్తోందని అన్నారు. కాంగ్రెస్ తీరు వల్ల ఇప్పుడు అన్ని వర్గాల వారు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని అన్నారు.  

ఎన్నికల కోడ్(election code) పేరిట అన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసింది.  ఇప్పుడు కోడ్ ముగిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీని నెరవేర్చడం లేదని విమర్శించారు. నిరుద్యోగుల కోసం విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్(job calendar) ఏమైందని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్-2లో 783 పోస్టులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని.. 2 వేల పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రూప్-3లో మరో 3 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(revanth reddy)కి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చేతకాదని.. ఆయన పీఆర్ స్టంట్లలో బిజీగా ఉన్నారని రేకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు.

 మెగా డీఎస్సీలో 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జీవో 46పై సీఎస్‌కు ఫిర్యాదు ఇవ్వాలని వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. గోడ మీద ఫిర్యాదును అతికించి వచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్ధులు తగిన మార్కులు వచ్చినా ఉద్యోగాలు ఇవ్వక పోవడం ఏమిటి అని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జీవో 46 తెచ్చినప్పటికీ.. మళ్లీ గెలిస్తే రద్దు చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ జీవో 46ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇపుడు వెనక్కి పోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. అనేక చట్టాలు మార్చుకుంటున్నప్పుడు జీవోలు మార్చుకుంటే తప్పు ఏమిటి అని అన్నారు.