BCCI: ఇంటర్వ్యూకి హాజరైన గంభీర్‌ని 3 ముఖ్యమైన ప్రశ్నలు అడిగిన బీసీసీఐ 2024-06-19 16:47:25

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టీమిండియా(team india)  హెడ్ కోచ్ రేసు( head coach race)లో ఉన్న మాజీ డ్యాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్( gowtham gambeer) తొలి రౌండ్ ఇంటర్వ్యూ మంగళవారం జరిగింది. కోచ్ రేసులో గంభీర్‌కు గట్టి పోటీ ఇస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్‌ కూడా ఇంటర్వ్యూకి హాజరయ్యారు. గంభీర్ వర్చువల్( virtual) గా హాజరవ్వగా ..డబ్ల్యూవీ రామన్ ప్రత్యక్షంగా హాజరయ్యారు.వీరిని బీసీసీఐ డైరక్ట్ క్వశ్చన్స్ మూడు అడిగారు. 


బీసీసీఐ అడిగిన ప్రశ్నలు ఇవే..
1. ఒక జట్టు కోచింగ్ స్టాఫ్‌( coaching staff) పై మీ ఆలోచనలు ఏమిటి?
2. ఒక జట్టు బ్యాటింగ్( batting) , బౌలింగ్ విభాగాల్లో కొందరు పెద్ద వయసు ఆటగాళ్లు ఉన్నప్పుడు.. ఆ జట్టు పరివర్తన దశను మీరు ఏవిధంగా ఎదుర్కొంటారు?
3. ఐసీసీ ట్రోఫీలు ( icc trofy) గెలవడంలో జట్టు వైఫల్యం, తీరికలేని షెడ్యూల్ నిర్వహణ అంశాలకు సంబంధించి వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు, ఫిట్‌నెస్ ప్రమాణాలపై మీ అభిప్రాయాలు ఏంటి?


ఈ మూడు ప్రధానమైన ప్రశ్నలను బీసీసీఐ కమిటీ( bcci)  అడిగిందని ‘రెవ్‌స్పోర్ట్స్’ ( rave sports) అనే క్రీడా వెబ్‌సైట్ పేర్కొంది. కాగా టీమిండియా హెడ్ కోచ్ పదవికి గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపు పూర్తయినట్టేనని వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ గంభీర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నెటజన్లు మాత్రం 2011 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న గౌతమ్ గంభీర్‌కి కోచ్ పదవి ఇచ్చినా ఫర్వాలేదని అన్నారు. గంభీర్‌ ఎల్లప్పుడూ చురుకుగా, వ్యూహాత్మకంగా ఉంటాడని అన్నారు.