Amazon package: అమెజాన్‌ ప్యాకేజీలో పాము.. కంగుతిన్న బెంగ‌ళూరు జంట‌! 2024-06-19 13:31:27

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఏంటో చిత్ర విచిత్రాలన్ని ఈ బెంగుళూరు( banglore)  లో నే ఎందుకు జరుగుతాయో...ఎప్పుడు ఏదో ఒక విచిత్రమైన సంఘటనలతో వార్తల్లో ఉంటూనే ఉంటుంది బెంగుళూరు. ఇప్పుడు ఏం జరిగిందంటారా..ఏముంది ఓ జంట అమెజాన్ ( amazon order) ఆర్డర్ చేసుకున్నారు..ఏం ఆర్డర్ చేశారంటారేమో...మనకెందుకు అది వాళ్ల పర్సనల్ కదా..ఏదో పార్మిల్ ఆర్డర్ చేశారు.
అమెజాన్‌లో ఎక్స్‌బాక్స్ కంట్రోల‌ర్ ఆర్డ‌ర్ చేసిన బెంగ‌ళూరు సాఫ్ట్‌వేర్ జంట‌కు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది.  ఆ ప్యాకేజీలో విష‌పూరిత పాము వ‌చ్చింది. పార్మల్ దీంతో ఈ ఆర్డ‌ర్ తాలూకు ఆన్‌బాక్సింగ్ వీడియోను ఆ క‌పుల్‌ సోష‌ల్ మీడియాలో( social media)  పెట్టింది. బెంగళూర్‌లోని స‌ర్జాపూర్ రోడ్‌లో ఉండే దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో( amazon)  ఎక్స్ బాక్స్( x box)  కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఆదివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేయగా.. పార్శిల్ మంగళవారం వచ్చింది. దాంతో ప్యాకేజీని ఓపెన్ చేసే స‌మ‌యంలో వీడియో తీశారు. 
అయితే, ఆ పాము( snake) టేపుకు అతుక్కొని ఉంది. దీంతో ఆ జంట ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని వాపోయారు. వెంటనే ఈ విష‌యాన్ని అమెజాన్ కస్టమర్ కేర్ సపోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. తమ పరిస్థితి చెప్పినప్పటికీ రెండు గంటల పాటు వెయిట్ చేయించారని ఆ జంట మండిప‌డింది. అసలు ఈ తప్పు..ఎలా జరిగిందో తెలీదంటు అపాలజీ చెప్పారు.