Susmitha Konidela: మెగా డాటర్ పై తిట్లదండకం కురిపించేలా చేసిన " పరువు"..! 2024-06-19 20:06:28

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మెగాస్టార్( megastar0 కు పరిచయాలు చెయ్యాలంటే ఇండస్ట్రీలో అందరిని పరిచయం చెయ్యాలి. అలాంటి వ్యక్తి కూతురుకి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. అయితే రీసెంట్ గా మెగాస్టార్ కూతురు సుస్మిత ( susmitha)సినీ ఎంట్రీకి గట్టిగా ట్రై చేస్తుంది.

చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత..సినిమాలు, వెబ్ సిరీస్ లకు నిర్మాతగా( producer) వ్యవహరిస్తోంది. రీసెంట్ గా  " పరువు " ఓ వెబ్ సిరీస్ ( webseries) తో కూడా మనకు ముందుకు వచ్చారు. ఎక్కువ మందిని ఆకట్టుకున్న ఈ వెబ్ సిరీస్.. విమర్మలకు ఎక్కువ శాతం తావు తీసిన సీరిస్ పరువు . నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య , నాగ బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ షో ఇప్పుడు జీ 5లో ప్రసారం అవుతోంది. ‘పరువు’లో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉంటాయి.


షో కాన్సెప్ట్ పరంగా గొప్పగా ఉన్నప్పటికీ, షోలోని కొన్ని విభాగాలు వివాదానికి గురయ్యాయి. మేకర్స్ నేరుగా ఏ కులం గురించి ప్రస్తావించనప్పటికీ, హార్డ్‌కోర్ ఎన్టీఆర్ అభిమాని కుల అభిమాని అనే ప్రస్తావనలు వారు చౌదరి కులాన్ని సూచిస్తున్నట్లు అర్థం. దీంతో పరువు ఇరకాటంలో పడేసింది.