movies: గాంత్ సీరిస్ రివ్యూ 2024-06-19 19:50:27

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఓటీటీ ప్లాట్ ఫామ్( ott)  పై థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ ను వదలడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి.   'గాంత్' ( ganth) జియో సినిమాస్ లో యమ స్పీడ్ లో దూసుకుపోతున్న సీరిస్. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్స్ .ఇక స్టోరీ చూద్దాం.


అది ఢిల్లీ సమీపంలోని 'హకీకత్ నగర్( hakikath nagar) ' .. అక్కడ జతిన్( jathin) ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. తన తండ్రి దశరథ్ ( dasarth) సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన జతిన్, తండ్రి మరణంతో మానసికంగా దెబ్బతింటాడు. ఆ షాక్ వలన అతనికి మాట పోతుంది. ఓ ఆరుగురుతో..కలిసి ఉంటున్నాడు ..వాళ్లు ఆరుగురు ఉరేసుకుంటారు.


ఈ కేసును గదర్ సింగ్ (manav vaj) )కి అప్పగిస్తారు. పోలీస్ ఆఫీసర్ కి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అతను తన కూతురు 'మినీ'తో కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఆ సమస్యల కారణంగా అతను మద్యానికి మరింత బానిస అవుతాడు. ఆ కారణంగానే సస్పెండ్ అవుతాడు. అలాంటి గదర్ ఈ కేసును ఎలా హ్యాండిల్ చేశాడు ఇదే అసలు ప్రాబ్లమ్.


గదర్ టీమ్ గా ఆఫీసర్ సత్యవతి (saloni bathra)  గొస్సేయిని (sravan) అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఉరికి వ్రేలాడుతున్న ఆరుగురిలో .. పదేళ్ల కుర్రాడు 'కుశాగ్ర' బ్రతికే ఉంటాడు. ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న సాక్షి ( mounika) ఆ కుర్రాడి బాధ్యతను తీసుకుంటుంది. జతిన్ ఫ్యామిలీ గురించి గదర్ ఆ చుట్టు పక్కలవారిని ఆరాతీయడం మొదలుపెడతాడు. 


జతిన్ ఫ్యామిలీ ఎవరితోనూ కలిసేవారు కాదనీ, ఆ ఇంట్లో ఆడవారిని ఎవరూ చూడలేదని .. ఆ కుటుంబ సభ్యుల ప్రవర్తన చిత్రంగా ఉండేదని అందరూ చెబుతారు. గదర్ తప్ప మిగిలినవారందరివి ఆత్మహత్యల్లాగే ఉంటారు.అసలు ఈ హత్యలు ఎలా జరిగాయి. అయితే ప్రతి ఎపిసోడ్ బ్యాంగ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. తరువాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అనే ఒక కుతూహలాన్ని పెంచుతూనే ఉంటాయి. ప్రధానమైనవిగా ఒక అరడజను పాత్రలు కనిపించినా, మిగతా పాత్రలు చాలానే వచ్చి వెళుతూ ఉంటాయి. ప్రతిపాత్ర సినిమాకి హైలెట్ అవుతాయి. అంతకంటే..ఎక్కువ ఫేమ్ వస్తుంది. ప్రతి క్యారక్టర్ కు పేరు పక్కా.